ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20 వరల్డ్‌కప్‌ యూఏఈకి?

ABN, First Publish Date - 2021-05-05T09:04:42+05:30

ఐపీఎల్‌ అర్ధంతరంగా వాయిదా పడడంతో.. భారత్‌ వేదికగా జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్‌క్‌పను యూఈఏకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ అర్ధంతరంగా వాయిదా పడడంతో.. భారత్‌ వేదికగా జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్‌క్‌పను యూఈఏకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ కూడా ఇందుకు సిద్ధమైనట్టు సమాచారం. సెప్టెంబరులో దేశవ్యాప్తంగా కరోనా మూడో దశ విజృంభణ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు భాగస్వామ్య దేశాలు భారత్‌కు రావడానికి వి ముఖత వ్యక్తం చేస్తాయేమోనని బోర్డు వర్గాలు భావిస్తున్నాయట. ఎనిమిది జట్లున్న ఐపీఎల్‌ నిర్వహణే కష్టమైంది.


అలాంటిది 16 జట్లు పాల్గొనే వరల్డ్‌క్‌పను నిర్వహించడం బీసీసీఐకు కత్తిమీద సామే..! ఎటువంటి రిస్క్‌ తీసుకోవడానికీ ఇష్టపడని బీసీసీఐ పాలకులు టోర్నీని యూఏఈకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. అందుకు కేంద్రం సానుకూలంగానే స్పందించిందట. 


ఈ దేశాలకు వెళ్లాలంటే ?

ఆస్ట్రేలియా:  ఎవర్నీ అనుమతించరు

బ్రిటన్‌ : 10 రోజుల క్వారంటైన్‌, రెండు టెస్ట్‌లు

న్యూజిలాండ్‌: 14 రోజుల క్వారంటైన్‌

దక్షిణాఫ్రికా: అందరికీ అనుమతి

బంగ్లాదేశ్‌: భారత్‌ నుంచి విమాన ప్రయాణాల రద్దు, భూమార్గంలో వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్‌

యూఏఈ: భారత్‌ నుంచి విమానాల రద్దు

వెస్టిండీస్‌: అందరికీ అనుమతి

Updated Date - 2021-05-05T09:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising