ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

ABN, First Publish Date - 2021-11-12T00:48:52+05:30

T20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్‌కి తెర లేచింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: T20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్‌కి తెర లేచింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టును బ్యాటింగ్‌కి దించాలని నిర్ణయించుకుంది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కి ఇది ఐదో సెమీఫైనల్‌ కాగా... ఆస్ట్రేలియాకు 4వ సెమీఫైనల్. పాక్ జట్టు తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై విజయం సాధించడంతో పాటు ఈ సారి ఒక్క  మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూడకుండా సెమీస్‌కు దూసుకొచ్చిన ఏకైక జట్టుగా నిలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే ఒకసారి T20 ప్రపంచకప్ విజేత కాగా... మరోసారి కప్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో విజేతగా నిలవాలని ఆస్ట్రేలియా జట్టు కూడా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ జరిగే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌ని ప్రస్తుత టోర్నీలో మూడుసార్లు ఉపయోగించారు. బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలించవచ్చని భావిస్తుండగా.... మంచు ప్రధాన పాత్ర పోషించనున్నందున టాస్‌‌దే కీలక పాత్ర అవుతుంది. బుధవారం అబుదాభిలో జరిగిన తొలి సెమీఫైనల్ ఇంగ్లండ్ జట్టుపై న్యూజీలాండ్ విజయం సాధించి ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ 2వ సెమీఫైనల్‌లో తలపడే ఆస్ట్రేలియా, పాక్ జట్లు రెండూ బలమైనవే కావడంతో మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-11-12T00:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising