ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిడ్నీ టెస్ట్..పుజారా ఔట్..ఉత్కంఠగా మారిన మూడో టెస్ట్

ABN, First Publish Date - 2021-01-11T15:54:19+05:30

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ ఉత్కంఠగా కొనసాగుతోంది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు విజయం సాధిస్తుందన్న నమ్మకంతో స్టేడియంలోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ ఉత్కంఠగా కొనసాగుతోంది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు విజయం సాధిస్తుందన్న నమ్మకంతో స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఒకదశలో సులువుగా టీమిండియా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. కానీ..వికెట్ కీపర్ రిషబ్ పంత్(118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) రన్స్ చేయగా.. స్టైలిష్  బ్యాట్స్‎మెన్ పుజారా ‌‌(77) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలుపు తీరాల‌కు వీరిద్దరూ తీసుకువచ్చారు. కొద్దీ సమయంలో ఇద్దరి వికెట్లను ఇండియా కోల్పోవడంతో భారత్ ఆటగాళ్లు ఒత్తడికి గురౌవుతున్నారు. పంత్, పుజారా ఔట్ కావడంతో హనుమ విహారి, అశ్విన్ మ్యాచ్‎ను డ్రా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీమిండియా విజయానికికు ఇంకా 127 పరుగులు కావాలి.. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. చివరి రోజు మ్యాచ్‎లో మరో 36 ఓవర్లు భారత్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ ఐదు వికెట్లను కోల్పోయి 280 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయం దక్కించుకోవాలంటే..ఐదు వికెట్లను తీయాల్సిఉంది.

Updated Date - 2021-01-11T15:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising