ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: డోపింగ్‌లో దొరికిపోయిన స్విస్ హర్డ్‌లర్

ABN, First Publish Date - 2021-07-23T21:43:18+05:30

400 మీటర్ల స్విస్ హర్డ్‌లర్ డోపింగ్ టెస్టులో దొరికిపోయి 9 నెలల నిషేధానికి గురయ్యాడు. ఫలితంగా అతడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: 400 మీటర్ల స్విస్ హర్డ్‌లర్ కరీం హుస్సేన్ డోపింగ్ టెస్టులో దొరికిపోయి 9 నెలల నిషేధానికి గురయ్యాడు. ఫలితంగా అతడి టోక్యో ఒలింపిక్స్ కల చెదిరిపోయింది. డోపింగ్‌ పరీక్షల్లో దొరికిపోయిన కరీంపై ఒలింపిక్ కమిటీ 9 నెలల నిషేధం విధించింది.


32 ఏళ్ల కరీం 2014లో జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌ విజేతగా నిలిచాడు. తాజాగా నిషేధిత ఉత్ర్ర్పేరకం వాడి నిషేధానికి గురయ్యాడు. యాంటీ డోపింగ్ స్విట్జర్లాండ్ అభ్యర్థన మేరకు స్విస్ ఒలింపిక్ డిసిప్లినరీ చాంబర్ కరీంపై 9 నెలల నిషేధం విధించినట్టు ఒలింపిక్ కమిటీ తెలిపింది. జులై 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది.


నిషేధం అనంతరం హుస్సేన్ ట్వీట్ చేస్తూ.. తన టోక్యో ఒలింపిక్స్ కల చెదిరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 9 నెలల నిషేధానికి గురయ్యానని పేర్కొన్నాడు. తాను తప్పు చేశానని, తనను క్షమించాలని వేడుకున్నాడు. 

Updated Date - 2021-07-23T21:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising