ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుశీల్‌ ఒలింపిక్‌ పతకాలను వెనక్కి తీసుకోరు.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2021-06-08T06:14:24+05:30

హత్య కేసులో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్టు కావడంతో అతడు సాధించిన రెండు ఒలింపిక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హత్య కేసులో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్టు కావడంతో అతడు సాధించిన రెండు ఒలింపిక్‌ పతకాలను వెనక్కి తీసుకుంటారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసులో సుశీల్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతోపాటు గ్యాంగ్‌స్టర్లతో ఉన్న లింకులు, నేర చరిత్ర కూడా బయటకు రావడం అతడి అభిమానులను విస్మయానికి గురి చేసింది.


అయితే, పతకాలను వెనక్కి తీసుకొనే విషయం గురించి చర్చిస్తే.. ప్రధానంగా గుర్తుకు వచ్చేది దక్షిణాఫ్రికా బ్లేడ్‌ రన్నర్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌. ప్రియురాలి హత్య కేసులో అతడు జైలు జీవితం గడుపుతున్నాడు. పారాలింపిక్స్‌లో పిస్టోరియస్‌ ఆరు స్వర్ణాలు, ఒక రజత, ఒక కాంస్యం సాధించాడు. హత్యా నేరం కింద అతడికి జైలు శిక్షపడినా.. పిస్టోరియస్‌ గెలిచిన ఒలింపిక్స్‌ పతకాలను వెనక్కి తీసుకోలేదు. 




విశ్వక్రీడల నిబంధనలేంటి?


ఒలింపిక్స్‌ చాప్టర్‌లో పేర్కొన్న నిబంధనలే పారాలింపిక్స్‌కూ వర్తిస్తాయి. చాప్టర్‌-6లో క్రమశిక్షణ చర్యలు తీసుకొనే విధానం, శిక్షలు, వివాదాల పరిష్కారం గురించి ప్రస్తావించారు. ఇందులో డోపింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, క్రీడల ప్రతిష్ఠకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, పోటీల్లో అవకతవకలకు పాల్పడినా, అమర్యాదకర ప్రవర్తన, ప్రజా చట్టాలను ఉల్లంఘించినా చర్యలు తీసుకొనే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ)కి ఉంది. విచారణ అనంతరం పతకాలను వెనక్కి తీసుకోవడంతోపాటు ఆయా ఆటగాడు లేదా టీమ్‌లపై అనర్హత వేటు వేసే అధికారం కూడా ఉంది.


అయితే, ఇందులో ఎక్కడా కూడా క్రిమినల్‌ నేరాల గురించిన ప్రస్తావనే లేదు. దీంతో పిస్టోరియస్‌ మర్డర్‌ కేసులో శిక్షణ అనుభవిస్తున్నా.. ఒలింపిక్‌ చాప్టర్‌ను ఉల్లంఘించినట్టు పరిగణించలేం. ఇప్పుడు సుశీల్‌ కుమార్‌కు కూడా ఇదే తరహా నిబంధనలు వర్తించనున్నాయి. అంటే, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ నెగ్గిన కాంస్యం, 2012 లండన్‌ క్రీడల్లో సాధించిన పతకాలు వెనక్కి తీసుకొనే అవకాశాల్లేవు. 


Updated Date - 2021-06-08T06:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising