ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదో వింత డ్రెస్పింగ్ రూమ్.. ఆ ముగ్గురూ చాలా ఫన్నీ: సూర్యకుమార్ యాదవ్

ABN, First Publish Date - 2021-04-09T03:34:14+05:30

ఇప్పటికే అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై జట్టు ఆరోసారి కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీ మొదటి నుంచి ముంబైలా రాణించిన జట్టు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ముంబై ఈ స్థాయిలో రాణించడానికి తమ డ్రెస్సింగ్ రూం వాతావరణమే కారణమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై జట్టు ఆరోసారి కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీ మొదటి నుంచి ముంబైలా రాణించిన జట్టు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ముంబై ఈ స్థాయిలో రాణించడానికి తమ డ్రెస్సింగ్ రూం వాతావరణమే కారణమని ఆ జట్టు టాపార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. తమ డ్రెస్సింగ్ రూం చాలా వింతగా, ఫన్నీగా ఉంటుందని అన్నాడు. ముఖ్యంగా కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లు ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ జట్టు మొత్తాన్నీ ఉత్సాహపరుస్తుంటారని చెప్పాడు. 


‘మ్యాచ్‌ గెలిచినా.. ఓడినా హార్దిక్, పొలార్డ్, ఇషాన్‌లు ఒకే తరహాలో ఉత్సాహంగా ఉంటారు. మమ్మల్ని ఉత్సాహపరుస్తారు. ఉదాహరణకు మ్యాచ్‌ గెలిస్తే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆహ్లదకర వాతావరణం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడిపోయినా అదే విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఓడినా.. గెలిచినా ఒకే తరహాలో ఉంటే ప్రతీ మ్యాచ్‌కు ఉత్సాహంగా బరిలోకి దిగొచ్చు. అదే మా విన్నింగ్స్ సీక్రెట్’ అంటూ స్కై చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ అలా బయట పెట్టేశావేంటి సూర్య.. ఇలా ఎవరైనా చెప్పేస్తారా..?’ అంటూ సరదా కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-09T03:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising