ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రవిడ్ నిర్ణయంతో షాకయ్యా: రికీ పాంటింగ్

ABN, First Publish Date - 2021-11-19T02:48:36+05:30

టీమిండియా చీఫ్ కోచ్ పదవిని ద్రవిడ్ స్వీకరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ పదవిని ద్రవిడ్ స్వీకరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ద్రవిడ్ పిల్లలు ఇంకా చిన్నవారేనని, ఇలాంటి సమయంలో ఇలాంటి పెద్ద బాధ్యతను నెత్తికెత్తుకోవడంతో తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పాడు.


అతడి కుటుంబం గురించి తనకు పూర్తి వివరాలు తెలియవు కానీ, అతడికింకా చిన్న పిల్లలు ఉన్నట్టు మాత్రం తెలుసన్నాడు. అందుకే ద్రవిడ్ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. అయితే, తాను కొందరితో మాట్లాడినప్పుడు మాత్రం ద్రవిడే కోచ్ పదవికి సరైన వ్యక్తి అని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. 

 

అంతేకాదు, టీమిండియా కోచ్ పదవికి తనకు కూడా ఆఫర్ వచ్చిందని, అయితే దానిని తాను సున్నితంగా తిరస్కరించానని పాంటింగ్ తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా హెడ్ కోచ్ పదవి కోసం కొందరు తనవద్ద ప్రస్తావించినట్టు చెప్పాడు. అయితే, తనకు అంత సమయం లేదని చెప్పానని పేర్కొన్నాడు. పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

Updated Date - 2021-11-19T02:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising