ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీలే సరసన ఛెత్రి

ABN, First Publish Date - 2021-10-12T06:39:34+05:30

టీమిండియా సాకర్‌ సారథి సునీల్‌ ఛెత్రి అరుదైన రికార్డును అందుకున్నాడు. శాఫ్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్‌ చేసి కెరీర్‌లో 77వ అంతర్జాతీయ గోల్‌ సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సునీల్‌ కెరీర్‌లో 77వ గోల్‌

నేపాల్‌పై భారత్‌ గెలుపు

 శాఫ్‌ చాంపియన్‌షిప్

మాలె: టీమిండియా సాకర్‌ సారథి సునీల్‌ ఛెత్రి అరుదైన రికార్డును అందుకున్నాడు. శాఫ్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్‌ చేసి కెరీర్‌లో 77వ అంతర్జాతీయ గోల్‌ సాధించాడు. దీంతో అత్యధిక గోల్స్‌ కొట్టిన అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాలో బ్రెజిల్‌ దిగ్గజం పీలే సరసన 37 ఏళ్ల ఛెత్రి నిలిచాడు. పీలే 92 మ్యాచుల్లో 77 గోల్స్‌ సాధించాడు. కాగా, ఛెత్రికిది కెరీర్‌లో 123వ మ్యాచ్‌. ఓవరాల్‌గా అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్లలో పీలే, యూఈఏ ప్లేయర్‌ అలీ మబ్‌కోచ్‌తో కలిసి ఛెత్రి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. 122 గోల్స్‌తో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా,  అర్జెంటీనా హీరో లియోనెల్‌ మెస్సీ 79 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, నేపాల్‌తో    పోరులో ఛెత్రి రికార్డు గోల్‌ కొట్టి భారత్‌కు ఓటమిని తప్పించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 1-0తో నేపాల్‌పై చెమటోడ్చి నెగ్గింది. మ్యాచ్‌ గోల్‌ లెస్‌ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 83వ నిమిషంలో ఛెత్రి గోల్‌ చేసి జట్టును గట్టెక్కించాడు. ఐదు జట్లు పోటీపడుతున్న శాఫ్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా 5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.  


వారికి సమాధానం దొరికిందనుకుంటా

భారత జట్టుకు మరికొన్ని రోజులు ఆడుతూ ఇలాగే గోల్స్‌ సాధిస్తానన్న నమ్మకముంది. నా నిలకడను ప్రశ్నిస్తున్న వారికి.. ఇప్పుడు తగిన సమాధానం దొరికిందనుకుంటా. దిగ్గజం పీలే గోల్స్‌ రికార్డును సమం చేయడం మరింత ఉత్తేజాన్నిస్తోంది.

-సునీల్‌ ఛెత్రి

Updated Date - 2021-10-12T06:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising