ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Paralympics: బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు రజతం

ABN, First Publish Date - 2021-09-05T14:01:11+05:30

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్‌ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు. టైటిల్ మ్యాచ్‌లో సుహాస్ యతిరాజ్ 2-1 స్కోరుతో ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ మజూర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఫైనల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. 


చివరకు టైటిల్ మ్యాచ్‌లో లూకాస్ విజయం సాధించారు. అతను 21-15, 17-21, 15-21 స్కోరుతో భారత ఆటగాడు సుహాస్‌ని ఓడించారు. ఇదే సమయంలో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్-4 ఈవెంట్‌లోని కాంస్య పతక మ్యాచ్‌లో భారతదేశానికి చెందిన తరుణ్ ధిల్లాన్ ఓటమి పాలయ్యారు. అతను 2-0 స్కోరుతో ఇండోనేషియా ఆటగాడు సెటివాన్ ఫ్రెడ్డీ చేతిలో ఓడిపోయారు. ఫ్రెడ్డీ 21-17, 21-11 పాయింట్లతో మ్యాచ్ గెలిచారు. టోక్యో పారాలింపిక్స్‌లో 12 వ రోజు, చివరి రోజు అయిన నేడు భారతదేశానికి గర్వకారణంగా మారనుంది. భారత అథ్లెట్లు బంగారు పతకాలు సాధించే అవకాశాలున్నాయి. పారా ఒలింపిక్స్ 11 వ రోజున భారత క్రీడాకారులు రెండు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలు దక్కించుకున్నారు.

Updated Date - 2021-09-05T14:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising