ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంపైర్ ముందే.. పొరబాటున బంతికి ఉమ్మి రాసిన స్టార్ ప్లేయర్!

ABN, First Publish Date - 2021-02-25T11:10:22+05:30

మొతేరా ఏకపక్షంగా సాగిన మూడో టెస్టు తొలిరోజు ఆటలో.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? అంపైర్ ఎదురుగానే బంతికి ఉమ్మి రాసేసాడీ స్టార్ ప్లేయర్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొతేరా: మొతేరా ఏకపక్షంగా సాగిన మూడో టెస్టు తొలిరోజు ఆటలో.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? అంపైర్ ఎదురుగానే బంతికి ఉమ్మి రాసేసాడీ స్టార్ ప్లేయర్. కరోనా మహమ్మారితో ప్రపంచం వణుకుతున్న తరుణంలో క్రికెట్‌లో చాలా కొత్త నిబంధనలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో బంతికి ఉమ్మి రాయకూడదనేది చాలా ముఖ్యమైనది. దీనిపై అప్పట్లో చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గని ఐసీసీ.. కావాలంటే ఆటగాళ్లు తమ చెమటను బంతిపై వాడుకోవచ్చని, కానీ ఉమ్మి మాత్రం రాయకూడదని తేల్చేసింది.


కానీ అప్పుడప్పుడూ ఆటగాళ్లు అలవాట్లో పొరబాట్లు చేసేస్తుంటారు. అదిగో ఇలానే బెన్‌స్టోక్స్ కూడా తప్పులో కాలేశాడు. అయితే దీన్ని గమనించిన అంపైర్లు వెంటనే అతన్ని హెచ్చరించి, బంతిని శానిటైజర్‌తో శుభ్రం చేశారు. ఇంగ్లండ్ జట్టులో మరే ఆటగాడైనా మరోసారి ఇదే తప్పు రిపీట్ చేస్తే రూల్స్ ప్రకారం ఆ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుంది.

Updated Date - 2021-02-25T11:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising