ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది కరోనా టెస్టా?.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన తెలుగు ప్లేయర్!

ABN, First Publish Date - 2021-01-13T03:36:44+05:30

థాయ్‌లాండ్ ఓపెన్ కోసం ఆ దేశానికి వెళ్లిన బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. ఇక్కడి వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. వారి పనితీరును తప్పుబడుతున్నాడు. దీనికి ఓ బలమైన కారణం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ కోసం ఆ దేశానికి వెళ్లిన బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. ఇక్కడి వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. వారి పనితీరును తప్పుబడుతున్నాడు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. థాయ్ ఓపెన్‌లో పాల్గొనే క్రీడాకారులు అందరికీ కరోనా టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌కు కూడా టెస్టులు చేశారు. దీని కోసం అతని మ్యూకస్ సేకరించే సమయంలో వైద్యులు సరిగ్గా జాగ్రత్తలు పాటించలేదు. దీంతో శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం ధారలుగా కారింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన శ్రీకాంత్.. ‘మేం కోర్టులో ఆడటం కోసం సిద్ధం అవుతాం. అంతేగానీ ఇలా రక్తం చిందించడం కోసం కాదు. ఇక్కడకు వచ్చాక నాలుగు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నా. వాటిలో ఏ ఒక్కసారీ మంచి అనుభవం లేదు’ అని శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు థాయ్‌లాండ్ వైద్య అధికారుల పనితీరును తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-01-13T03:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising