ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాంత్‌కు ఝలక్‌

ABN, First Publish Date - 2021-03-18T10:04:13+05:30

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత సింగిల్స్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌ ఆదిలోనే వెనుదిరిగారు. బుధవారం మొదలైన ఈ టోర్నీ తొలిరౌండ్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కశ్యప్‌ అవుట్‌
  • సింధు ముందంజ
  • ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత సింగిల్స్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌ ఆదిలోనే వెనుదిరిగారు. బుధవారం మొదలైన ఈ టోర్నీ తొలిరౌండ్లో 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 11-21, 21-15, 12-21తో అన్‌సీడెడ్‌ షట్లర్‌ గుయెన్‌ హాట్‌ (ఐర్లాండ్‌) చేతిలో కంగుతిన్నాడు. మరో మ్యాచ్‌లో కశ్యప్‌ 13-21, 20-22తో టాప్‌సీడ్‌ కెంటో మొమోటా చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఐదోసీడ్‌ సింధు 21-11, 21-17తో సోనియా చే (మలేసియా)పై గెలిచి రెండోరౌండ్‌ చేరింది. పురుషుల డబుల్స్‌లో ఆరోసీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-7, 21-10తో నిఖర్‌-అనిరుద్ధ జంటపై, మహిళల డబుల్స్‌లో అశ్విని-సిక్కి రెడ్డి ద్వయం 21-14, 21-12తో బెన్యాపా-నుంతకాన్‌ జోడీపై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించాయి. పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ జోడీ, మహిళల డబుల్స్‌లో మేఘన- పూర్వీషా జంట ఆరంభ రౌండ్లలోనే ఓడారు. 


జట్టులో అంతా నెగెటివ్‌.. 

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌పలో పోటీపడుతున్న భారత జట్టులోని  ముగ్గురు షట్లర్లు పాజిటివ్‌గా తేలారంటూ మంగళవారం వార్తలు వెలువడ్డాయి. అయితే, తొలుత నిర్వహించిన టెస్టులో ఆ ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినా.. బుధవారం మళ్లీ పరీక్షించగా నెగెటివ్‌గా తేలారని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది. 


Updated Date - 2021-03-18T10:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising