ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 World Cup: సౌతాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు

ABN, First Publish Date - 2021-10-27T01:00:16+05:30

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా నడిపాడు. ఇద్దరూ ఎలాంటి జంకుగొంకు లేకుండా యథేచ్ఛగా షాట్లు ఆడారు. ఈ క్రమంలో 30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 39 పరుగులు చేసిన హెండ్రిక్స్ అవుటయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మార్కరమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా అర్ధ సెంచరీ (51) చేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. డుసెన్ 43 పరుగులు (నాటౌట్) చేశాడు.


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 26 పరుగులు చేశాడు. సిమన్స్ 16, పూరన్, క్రిస్ గేల్ చెరో 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.


సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ 3, కేశవ్ మహారాజ్ 2, రబడ, నార్జ్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు ఓవర్లలో 14 పరుగలు మాత్రమే ఇచ్చిన సౌతాఫ్రికా బౌలర్ నార్జ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన విండీస్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

Updated Date - 2021-10-27T01:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising