నేను అలాంటోణ్ణి కాదు
ABN, First Publish Date - 2021-10-29T08:37:10+05:30
షార్జా: తాను జాత్యహంకారిని కాదని సౌతాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ స్పష్టంజేశాడు. తనపై ఆ ముద్ర వేయడం ఎంతో బాధించిందని తెలిపాడు.
షార్జా: తాను జాత్యహంకారిని కాదని సౌతాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ స్పష్టంజేశాడు. తనపై ఆ ముద్ర వేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. తన చర్యలవల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని సహచర జట్టు సభ్యులను, అభిమానులను కోరాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు మద్దతిస్తానని ప్రకటించాడు. తాను మోకాలిపై నిలుచోవడం ద్వారా ఆ ఉద్యమంపై అవగాహన కల్పించవచ్చని భావిస్తే అందుకు తాను సిద్ధమన్నాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో జట్టు ఆడే ఇతర మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని డికాక్ చెప్పాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు సంఘీభావంగా..వెస్టిండీస్‌తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా మోకాలిపై కూర్చొని మద్దతు తెలిపేందుకు డికాక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు..ఆ మ్యాచ్‌నుంచి కూడా అతడు వైదొలగి సంచలనం రేపాడు. బోర్డు ఆదేశాన్ని ధిక్కరించిన అతడిని తప్పుబడుతూ..జాత్యహంకారని విమర్శలు వెల్లువెత్తాయి.
Updated Date - 2021-10-29T08:37:10+05:30 IST