ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగూలీ బర్త్‌డే.. అదిరిపోయే ఫొటో షేర్ చేసిన సెహ్వాగ్

ABN, First Publish Date - 2021-07-08T21:55:27+05:30

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బర్త్ డే సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బర్త్ డే సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనా, వసీం జాఫర్, ప్రజ్ఞాన్ ఓఝా, మహ్మద్ కైఫ్ సహా పలువురు తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐతోపాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా బర్త్ డే విషెస్ తెలిపాయి. ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూ ఉండాలని ట్వీట్ చేసిన సెహ్వాగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేసిన ఫొటోను పోస్టు చేశాడు. ఇటీవల విపరీతంగా వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్లు రామ్‌చరణ్, ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫొటోను పోస్టు చేశాడు. అందులో సెహ్వాగ్ బైక్ నడుపుతున్నట్టు ఉండగా, ‘దాదా’ వెనక కూర్చున్నట్టుగా మార్చారు.  ఇప్పటికే ఈ ఫొటోకు దాదాపు 5 లక్షల లైక్‌లు వచ్చాయి.


ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన మూడో ఆటగాడు, ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (183), టీమిండియా కెప్టెన్‌గా విదేశాల్లో 28 టెస్టుల్లో 11 విజయాలు అందించిన సౌరవ్ గంగూలీకి ‘హ్యాపీ బర్త్ డే’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. మైదానంలో ప్రతి వైపున గ్యాప్ కనుగొనే ప్రిన్స్‌కు బర్త్ డే శుభాకాంక్షలు అని చెన్నై సూపర్ కింగ్స్ విష్ చేస్తే, క్రికెట్‌లో తన జట్టులో ఎన్నో విధాలుగా స్ఫూర్తి నింపే గంగూలీకి హ్యాపీ బర్త్ డే అంటూ పంజాబ్ కింగ్స్ శుభాకాంక్షలు తెలిపింది. అలాగే హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, ప్రజ్ఞాన్ ఓఝా, వసీం జాఫర్ తదితరులు గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-07-08T21:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising