ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sorry India: అటాను దాస్

ABN, First Publish Date - 2021-08-01T01:36:58+05:30

పతకంపై ఆశలు రేపి ఓటమి పాలైన భారత ఆర్చర్ అటానుదాస్ దేశానికి క్షమాపణలు తెలిపాడు. రౌండ్ ఆఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: పతకంపై ఆశలు రేపి ఓటమి పాలైన భారత ఆర్చర్ అటానుదాస్ దేశానికి క్షమాపణలు తెలిపాడు. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా జపాన్‌కు చెందిన టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో 4-6తో ఓటమిపాలైన తర్వాత .. ‘‘సారీ ఇండియా, ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించలేకపోయా.  మీడియా, శాయ్, ఇండియన్ ఆర్చరీ నుంచి గొప్ప సహకారం లభించింది. క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు సాగాల్సి ఉంటుంది. లేకపోతే చెప్పడానికి ఏమీ ఉండదు. జై హింద్’’ అని అటాను ట్వీట్ చేశాడు.  


సహ ఆర్చర్ దీపిక కుమారిని అటాను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినప్పటికీ క్రీడ నుంచి బ్రేక్ తీసుకునే అవకాశం రాలేదని అటాను పేర్కొన్నాడు. పెళ్లయిన తర్వాత తామిద్దరం కలిసి ఎక్కడికీ వెళ్లలేదని పేర్కొన్నాడు. తమ కోసం ఇల్లు కట్టుకున్నా ఎప్పుడూ అక్కడికి వెళ్లలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి వెళ్లి 8 నెలలు అయిందన్నాడు. అయితే, అది సమస్య కాదన్నాడు. కొవిడ్ కూడా ఉందని పేర్కొన్న అటాను.. తమకు క్రీడ నుంచి బ్రేక్ అంటూ ఏమీ లేదని, ఆర్చరీ తప్ప తమకు మరో లోకం లేదని చెప్పుకొచ్చాడు. 


దీపికా కుమారికి ఇది మూడో ఒలింపిక్స్ కాగా, అటానుకు రెండోది. ఒలింపిక్స్‌లో తాను వీలైనంతగా శ్రమించానని, పతకం తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశానని,  కానీ అది నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2021-08-01T01:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising