ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: తై జుకు తలవంచిన సింధు

ABN, First Publish Date - 2021-07-31T22:13:22+05:30

ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం ఖాయం చేసుకుంటుందనుకున్న పీవీ సింధు నిరాశ పరిచింది. ప్రపంచ నంబర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం ఖాయం చేసుకుంటుందనుకున్న పీవీ సింధు నిరాశ పరిచింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ తై జుతో హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో సింధు వరుస సెట్లలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తై జు దూకుడు ముందు నిలవలేకపోయింది. ఫలితంగా 18-21, 12-21తో ఓటమి పాలైంది.  


ఏడో ర్యాంకర్ అయిన సింధు- తై జు 18 సార్లు  తలపడగా 13సార్లు తై జునే నెగ్గింది. 5సార్లు మాత్రమే సింధు ఆమెపై పైచేయి సాధించింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్, 2018 ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో వంటి కీలక టోర్నీల్లో తై జును ఓడించి సింధు సత్తా చాటింది. దీంతో అదే జోరును ఇప్పుడు కూడా చూపుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది.


మరోవైపు, బాక్సింగ్‌లోనూ భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి. పతకం తెస్తుందని భావించిన పూజారాణి నిరాశపరిచింది. మహిళల మిడిల్‌వెయిట్  క్వార్టర్ ఫైనల్‌లో క్యూ లితో జరిగిన పోరులో 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. 

Updated Date - 2021-07-31T22:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising