ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు

ABN, First Publish Date - 2021-07-30T20:32:06+05:30

ఒలింపిక్స్‌లో పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠ పోరులో యమగూచిపై పీవీ సింధు ఘనవిజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో మరో పతకానికి చేరువైంది. ఒలింపిక్స్‌లో భాగంగా నేడు జపాన్‌కు చెందిన 4సీడ్ క్రీడాకారిణి అకనే యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు 21-13, 22-20తో యమగుచిని మట్టి కరిపించి సెమీస్‌కు దూసుకెళ్లి మరో పతకానికి అంగుళం దూరంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్ సింధు గత ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకుంది. 


సింధు సెమీస్‌లో రేపు ప్రపంచ నంబర్ వన క్రీడాకారిణి అయిన తైవాన్‌కు టై టిజు యింగ్ లేదంటే, థాయిలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్ 6 క్రీడాకారిణి రచనోక్ ఇంటానాన్‌తో కానీ తలపడుతుంది. కాగా, నిన్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ప్రపంచ నంబరు 12 క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 41 నిమిషాల్లోనే ఓడించింది. కాగా, డెన్మార్క్‌కు చెందిన మియా ఈ ఏడాది జనవరిలో సింధును వరుస సెట్లలో ఓడించడం గమనార్హం.  


Updated Date - 2021-07-30T20:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising