షఫాలీపైనే కళ్లన్నీ!
ABN, First Publish Date - 2021-06-27T09:01:55+05:30
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన భారత అమ్మాయిలు.. ఇప్పుడు వైట్‌బాల్ సమరానికి సిద్ధమయ్యారు.
ఇంగ్లండ్‌తో భారత్ తొలి వన్డే నేడు
మ. 3.30 నుంచి సోనీ టెన్-1లో
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన భారత అమ్మాయిలు.. ఇప్పుడు వైట్‌బాల్ సమరానికి సిద్ధమయ్యారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. ముఖ్యంగా చిచ్చరపిడుగు షఫాలీ వర్మపైనే అందరి దృష్టీ నెలకొంది. ఆడిన తొలి టెస్ట్‌లోనే అదరగొట్టిన టీనేజ్ సంచలనం వర్మ.. వన్డేల్లోనూ అరంగేట్రం ఖాయమని తెలుస్తోంది.
భారీ హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లో లేని లోటును షఫాలీభర్తీ చేస్తుందని భావిస్తున్నారు. ఓపెనర్లుగా స్మృతి మంధాన, షఫాలీ.. వన్ డౌన్‌లో పూనమ్ రౌత్, కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌తోపాటు ఆరో నంబర్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బరిలోకి దిగే చాన్సుంది. ఇక వికెట్ కీపర్‌గా కొత్తమ్మాయి ఇంద్రాణీ రాయ్‌తో ప్రయోగం చేస్తారా? లేదా టెస్టులో రాణించిన తానియా భాటియాకు అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి. పేసర్లలో జులన్ చోటు ఖాయం కాగా.. పూజ, అరుంధతి, శిఖా పాండేలో ఇద్దరికి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. సిన్నర్లలో ఏక్తా బిస్త్ లేదా రాధా యాదవ్, స్నేహ్ రాణా మధ్య పోటీ నెలకొంది. ఇంగ్లండ్ విషయానికొస్తే.. నల్లజాతీయురాలు సోఫియా డంక్లే.. వన్డేల్లోనూ అరంగేట్రం చేసే చాన్సులు పుష్కలంగా ఉన్నాయి. బ్యూమాంట్, కెప్టెన్ హీథర్ నైట్, ఆల్‌రౌండర్ స్కివర్‌పైనే ఇంగ్లిష్ బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడింది.
Updated Date - 2021-06-27T09:01:55+05:30 IST