ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ఫార్మాట్లలోనూ షఫాలీ

ABN, First Publish Date - 2021-05-15T09:17:33+05:30

వచ్చే నెలలో ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్‌ జట్లను ఎంపిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత మహిళల జట్టు 

న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్‌ జట్లను ఎంపిక చేశారు. ఈ టూర్‌లో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు కూడా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగనున్నాయి. వచ్చే నెలలో మహిళల జట్టు స్వదేశం వీడనుంది. అయితే ఈ మూడు ఫార్మాట్లలోనూ టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ ఎంపిక కావడం విశేషం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సకు షఫాలీతో పాటు శిఖా పాండేను పరిగణనలోకి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. దీంతో ఈసారి ఇద్దరినీ అన్ని ఫార్మాట్లకు ఎంపిక చేశారు. అయితే లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ గాయంతో జట్టుకు దూరమైంది. తెలుగ మ్మాయి అరుంధతి రెడ్డి మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకోగా.. వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌వుమన్‌ ఇంద్రాణీ రాయ్‌ (జార్ఖండ్‌) తొలిసారి వన్డే, టెస్టు జట్టుకు ఎంపికైంది. మిథాలీ రాజ్‌ వన్డేలతో పాటు టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. 


వన్డే, టెస్టు జట్టు:

మిథాలీ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, పూనమ్‌ రౌత్‌, ప్రియా పూనియా, దీప్తి, జెమీమా, షఫాలీ, స్నేహ్‌ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి, గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిస్త్‌, రాధా యాదవ్‌.


టీ20:

హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా, షఫాలీ, రిచా ఘోష్‌, హర్లీన్‌ డియోల్‌, స్నేహ్‌ రాణా, తానియా భాటియా, ఇంద్రాణీ రాయ్‌, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌, అరుంధతి, పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిస్త్‌, రాధా యాదవ్‌, సిమ్రన్‌.

Updated Date - 2021-05-15T09:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising