ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొతేరా టెస్టు: పంత్ ధమాకా.. సుందర్ పటాకా..

ABN, First Publish Date - 2021-03-05T22:51:12+05:30

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్) సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్) సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు 24/1తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా.. కొద్ది సేపటికే పుజారా(17) వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించినా అర్థ సెంచరీకి కొద్ది దూరంలో 49 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో తొలి రెండు సెషన్లు ఇంగ్లండ్‌ బౌలర్లదే పేచైయిగా మారింది. వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోవడంతో ఒకానొక దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపారు. వీరిద్దరూ కలిసి 113 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా పటిష్ఠ స్థితికి చేరింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులతో ఉంది.

Updated Date - 2021-03-05T22:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising