ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వా.. విరాట్‌ గురించి మాట్లాడేది?

ABN, First Publish Date - 2021-05-17T10:04:59+05:30

విరాట్‌ కోహ్లీయే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు. కేన్‌ విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే అతడినే వరల్డ్‌ బెస్ట్‌ అనే వారని ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ కామెంట్‌కు భట్‌ బదులిచ్చాడు.a

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైకేల్‌ వాన్‌కు  సల్మాన్‌ బట్‌ కౌంటర్‌


కరాచీ: విరాట్‌ కోహ్లీయే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు. కేన్‌ విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే అతడినే  వరల్డ్‌ బెస్ట్‌ అనే వారని ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ కామెంట్‌కు భట్‌ బదులిచ్చాడు.‘వీరిద్దరిని పోల్చడం సరికాదు. కోహ్లీ ఇప్పటికే 70 శతకాలు సాధించాడు. అతడికి అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. జట్టుకు తన ఆటతీరుతో ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో అతడిని మించిన వారు లేరు. అయితే విలియమ్సన్‌ను గొప్ప కెప్టెన్‌గా చెప్పవచ్చు. కానీ వాన్‌ వారి కెప్టెన్సీ గురించి పోల్చలేదు. ఆటగాళ్లుగా ఈ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది’ అని భట్‌ తేల్చాడు. వాన్‌ వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదని, అతడు వీరిద్దరి గురించి మాట్లాడటం అనవసరమని ఎద్దేవా చేశాడు. దీనికి వాన్‌ ఘాటుగా బదులిస్తూ.. ‘నా గురించి నీ అభిప్రాయం విన్నా. కానీ నేను మ్యాచ్‌ ఫిక్సర్‌ కాదనే విషయం మర్చిపోయావు’ అని భట్‌ గతాన్ని ఉద్దేశిస్తూ వాన్‌ దెప్పిపొడిచాడు.

Updated Date - 2021-05-17T10:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising