ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డుసెన్‌ వీరోచిత శతకం

ABN, First Publish Date - 2021-10-21T09:27:11+05:30

వాన్‌డెర్‌ డుసెన్‌ (51 బంతుల్లో 101 నాటౌట్‌) వీరోచిత శతకంతో.. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన వామప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాక్‌పై సఫారీల విజయం


అబుధాబి: వాన్‌డెర్‌ డుసెన్‌ (51 బంతుల్లో 101 నాటౌట్‌) వీరోచిత శతకంతో.. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన వామప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (51), ఆసిఫ్‌ అలీ (32) రాణించారు. రబాడ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 190/4 స్కోరు చేసి గెలిచింది. 


విండీస్‌కు షాక్‌..

పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని వెస్టిండీ్‌సను అప్ఘానిస్థాన్‌ 56 పరుగులతో చిత్తు చేసింది. తొలుత అప్ఘాన్‌ 20 ఓవర్లలో 189/5 స్కోరు చేసింది. హజ్రతుల్లా జజాయ్‌ (56), మహ్మద్‌ షహజాద్‌ (54) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఒబెడ్‌ మెకాయ్‌ (2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్‌ నబి (4-2-2-3) సంచలన బౌలింగ్‌ ధాటికి ఛేదనలో వెస్టిండీస్‌ ఓవర్లన్నీ ఆడి 133/5 స్కోరు చేసి ఓడింది. 


కివీస్‌పై ఇంగ్లండ్‌ గెలుపు..

బట్లర్‌ (73) ధనాధన్‌ అర్ధ శతకంతో ఇంగ్లండ్‌ 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 163/6 స్కోరు చేసింది. ఛేదనలో కివీస్‌ 19.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. గప్టిల్‌ (41) టాప్‌స్కోరర్‌. మార్క్‌వుడ్‌ (4/23), ఆదిల్‌ రషీద్‌ (3/18) కివీస్‌ బ్యాటర్ల పనిబట్టారు. 

Updated Date - 2021-10-21T09:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising