ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sachin Tendulkar: అచ్రేకర్‌కు నివాళి

ABN, First Publish Date - 2021-07-25T01:54:54+05:30

గురుపూర్ణిమను పురస్కరించుకుని టీమిండియా మాజీ సారథి సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గురుపూర్ణిమను పురస్కరించుకుని టీమిండియా మాజీ సారథి సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు నివాళులర్పించాడు. అచ్రేకర్ ఇంటికి వెళ్లిన సచిన్ ఆయన ఫొటో వద్ద పూలు పెట్టి నివాళి అర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు. జ్ఞాపకాలన్నీ మళ్లీ చుట్టుముట్టాయని, తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని రాసుకొచ్చాడు. 


సచిన్ పాఠశాల స్థాయిలో అచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత 16 ఏళ్లకే భారత జట్టులో చోటు సంపాదించాడు. 24 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు జట్టుకు సేవలు అందించాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలుగొట్టాడు. మరెన్నింటినో సృష్టించాడు. ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన సచిన్‌ను అభిమానులు ‘క్రికెట్ గాడ్’గా పిలుచుకుంటున్నారు.



Updated Date - 2021-07-25T01:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising