ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ కెప్టెన్సీ ఎందుకు పోయిందో చెప్పిన మాజీ సెలక్టర్ సాబా కరీం!

ABN, First Publish Date - 2021-12-10T01:04:44+05:30

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించారో మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలక్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించారో మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలక్టర్ సాబా కరీం చెప్పేశాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లీ తన నాలుగేళ్ల కెరియర్‌లో ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడమే కారణం అయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించినట్టు బీసీసీఐ చెబుతున్నప్పటికీ, కోహ్లీని తొలగించారని చెప్పడమే సరైనదని అన్నాడు. తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించాడని, కానీ వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని కరీం గుర్తు చేశాడు.


అంటే దానర్థం అతడు వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకున్నాడని, అయితే, ఐసీసీ ట్రోఫీల్లో ఒక్కటి కూడా గెలవకపోడమే అతడి కొంప ముంచిందని ‘ఖేల్ ‌నీతి’ అనే యూట్యూబ్ షోలో మాట్లాడుతూ సాబా కరీం పేర్కొన్నాడు.


కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ, బీసీసీఐ నుంచి ఎవరో ఒకరు కానీ కెప్టెన్సీ తొలగింపు సమాచారాన్ని కోహ్లీకి చేరవేసే ఉంటారని కరీం అభిప్రాయపడ్డాడు. ద్రావిడ్ నిత్యం ఆటగాళ్లతో మాట్లాడుతూనే ఉంటాడని, కాబట్టి తాజా నిర్ణయం గురించి కూడా అతడు కోహ్లీతో మాట్లాడి ఉండొచ్చని కరీం చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-12-10T01:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising