ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రితికతో డేటింగ్.. వాళ్లకు చెబితే అంతే.. అందుకే: రోహిత్

ABN, First Publish Date - 2021-08-13T07:57:12+05:30

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి భార్య రితిక సింగ్ చూడచక్కని జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. రితిక సింగ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి భార్య రితిక సింగ్ చూడచక్కని జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. రితిక సింగ్ రోహిత్ శర్మ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం కాలం క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండి ఆ తర్వాత మరికొంతకాలం డేటింగ్‌లో గడిపి.. చివరిగా 2015లో పెళ్లి చేసుకున్నారు.


అయితే వివాహానికి ముందు వీరు డేటింగ్‌లో ఉన్న విషయం చాలా సీక్రెట్‌గా ఉంచారు. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌‌తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ విషయంపై నోరు విప్పాడు. రితిక తన మేనేజర్‌గా ఉన్నసమయంలోనే తామిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవారమని చెప్పాడు. సాయంత్రం సమయంలో కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేసేవారమని చెప్పాడు. అయితే తామిద్దరిలో స్నేహానికి మించిన బంధం ఏదో ఉందని తమ స్నేహితులే ముందుగా తనకు చెప్పినట్లు రోహిత్ తెలిపాడు.


‘కొంతకాలానికి వారి మాటలే నిజమయ్యాయి. నేను, రితికా ఒకరికొకరం దగ్గరయ్యాం. డేటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ విషయం నా స్నేహితులకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఒకవేళ వారికి చెప్పి ఉంటే నన్ను ఏమాత్రం ప్రశాంతంగా ఉండనిచ్చేవారు కాదు’ అంటూ రోహిత్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

Updated Date - 2021-08-13T07:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising