ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెరీర్ బెస్ట్ టెస్ట్ ర్యాంకుల్లో రిషబ్, రోహిత్

ABN, First Publish Date - 2021-03-11T02:37:01+05:30

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ తమ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ సాధించారు. ర్యాంకింగ్ పట్టికలో రిషబ్ ఏకంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే ఆ స్థానంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ తమ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ సాధించారు. ర్యాంకింగ్ పట్టికలో రిషబ్ ఏకంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న రోహిత్ శర్మతో పాటు ఆ స్థానాన్ని పంచుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో సెంచరీ సాధించి అదరగొట్టిన పంత్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాగి టాప్‌ టెన్‌లోకి చేరాడు. మొత్తంగా 747 పాయింట్లతో ఉన్న పంత్.. ఇన్ని పాయింట్లు సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత బ్యాట్స్‌మెన్‌లలో ఇన్ని పాయింట్లు సాధించిన 15వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఓపెనర్ రోహిత్ కూడా 747 సాధించి ఏడో స్థానంలో నిలిచాడు.


ఐసీసీ ర్యాకింగ్స్ పట్టికలో న్యూజిల్యాండ్ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్, బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.



Updated Date - 2021-03-11T02:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising