ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Revanth tweet: మోదీ స్టేడియం పేరు మార్చండి

ABN, First Publish Date - 2021-08-07T13:12:06+05:30

ప్రధాని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన నేపథ్యంలో, నరేంద్ర మోడీ స్టేడియానికి ఒక క్రికెటర్ పేరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన నేపథ్యంలో, నరేంద్ర మోడీ స్టేడియానికి ఒక క్రికెటర్ పేరు పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మోటెరా నగరంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన  నరేంద్ర మోడీ స్టేడియం పేరు మార్చాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్‌లో కోరారు.‘‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన తర్వాత, ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియానికి క్రికెటర్ పేరిట మార్చాలని మేం ప్రధానిని కోరుతున్నాం. అలాగే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి కూడా క్రికెట్ లెజెండ్ పేరు పెట్టండి’’ అని  ఎంపీ రేవంత్ ట్వీట్ చేశారు.మోటెరాలోని సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడంపై  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీసింది.


Updated Date - 2021-08-07T13:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising