ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లేఆఫ్స్‌కు బెంగళూరు

ABN, First Publish Date - 2021-10-04T07:14:26+05:30

కెప్టెన్‌గా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించాలన్న కోహ్లీ ఆశలు సజీవంగా నిలిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌పై గెలుపు

మ్యాక్స్‌వెల్‌ మెరుపులు

చాహల్‌ లెగ్‌‘బ్రేకు’లు

షార్జా: కెప్టెన్‌గా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించాలన్న కోహ్లీ ఆశలు సజీవంగా నిలిచాయి. పంజాబ్‌పై ఆరు పరుగులతో నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ సాధికారంగా ప్లేఆ్‌ఫ్సకు చేరింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ ప్లేఆ్‌ఫ్సలో ప్రవేశించగా.. మూడో జట్టుగా బెంగళూరు ముం  దంజ వేసింది. ఆదివారం మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 164/7 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (33బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు హాఫ్‌ సెంచరీ చేశాడు. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (38బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లతో 40), విరాట్‌ కోహ్లీ (24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), డివిల్లీర్స్‌ (18బంతుల్లో ఫోరు, 2సిక్సర్లతో 23) రాణించారు. హెన్రిక్స్‌, షమి చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 158/6 స్కోరుకే పరిమితమైంది. మయాంక్‌ అగర్వాల్‌ (42బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 39) సత్తా చాటారు. చాహల్‌  3 వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


శుభారంభం దక్కినా:

ఎప్పటిమాదిరే పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించినా.. మిడిలార్డర్‌ వైఫల్యంతో మ్యాచ్‌ను చివరికంటా తెచ్చుకోవడం.. టెయిలెండర్లు చేతులెత్తేయడం పరిపాటిగా మారడంతో ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. మూడో ఓవర్లో రాహుల్‌ 4,6, నాలుగో ఓవర్లో మయాంక్‌ 6, ఆపై షాబాజ్‌ ఓవర్లో చెరో 6, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్‌ 49/0తో నిలిచింది. వీరి ధాటికి 11 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 91 రన్స్‌ వచ్చాయి. సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకుపోతున్న ఈ జోడీని విడదీస్తూ రాహుల్‌ను షాబాజ్‌ అవుట్‌ చేశాడు. పూరన్‌ (3) పేలవఫామ్‌ను కొనసాగించగా.. అర్ధసెంచరీ చేసిన మయాంక్‌ను చాహల్‌ తెలివైన బంతితో బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఓ అద్భుత లెగ్‌బ్రేక్‌తో సర్ఫ్‌రాజ్‌నూ చాహల్‌ అవుట్‌ చేశాడు. ఆదుకుంటాడనుకున్న మార్‌క్రమ్‌(20) నిరాశపరిచాడు. చివరి 2 ఓవర్లలో 27 రన్స్‌ అవసరమవగా.. 19వ ఓవర్లో సిరాజ్‌ 8 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌ను హర్షల్‌ చక్కగా వేయడంతో పంజాబ్‌ సిక్సర్‌ సహా 12 రన్సే చేయగలిగింది. 


మ్యాక్స్‌వెల్‌ సిక్సర్ల హోరు:

పడిక్కల్‌, కోహ్లీ బెంగళూరుకు శుభారంభం అందించినా.. ఆటంతా మ్యాక్స్‌వెల్‌దే. బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడి అతడు స్కోరుబోర్డును రేసుగుర్రంలా పరిగెత్తించాడు. తొలి ఓవర్లో కోహ్లీ ఫోర్‌ కొట్టగా..అర్ష్‌దీప్‌ వేసిన మూడో ఓవర్లో పడిక్కళ్‌ 6,4తో ఆపై బిష్ణోయ్‌ బౌలింగ్‌లో 4,4తో కదం తొక్కాడు. ఐదో ఓవర్లో లైఫ్‌ లభించిన కోహ్లీ అనంతరం బ్యాట్‌ ఝళిపించాడు. అర్ష్‌దీప్‌ ఓవర్లో పడిక్కళ్‌ 6,4తో రెచ్చిపోవడంతో పవర్‌ ప్లేలో బెంగళూరు 55 రన్స్‌ చేసింది. ఇక ఎనిమిదో ఓవర్లో బిష్ణోయ్‌ వేసిన బంతి పడిక్కళ్‌ గ్లోవ్‌ను తాకుతూ కీపర్‌ రాహుల్‌ చేతిలో పడినా.. థర్డ్‌అంపైర్‌ అవుటివ్వలేదు. 10వ ఓవర్లో కోహ్లీ, క్రిస్టియన్‌ను, తదుపరి ఓవర్లో పడిక్కళ్‌ను అవుట్‌ చేసి హెన్రిక్స్‌ బెంగళూరుకు షాకిచ్చాడు. ఈదశలో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మ్యాక్స్‌వెల్‌ 13వ ఓవర్లో 6,6, 15వ ఓవర్లో 2 సిక్సర్లు బాది అదే ఊపులో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇక, భారీషాట్లతో బ్యాట్‌కు పనిచెబుతున్న తరుణంలో డివిల్లీర్స్‌ రనౌటయ్యాడు. దాంతో 73 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాక్స్‌వెల్‌ జోరుకు చివరి ఓవర్లో ముగింపు పలికిన షమి.. అదే ఓవర్లో షాబాజ్‌, గార్టన్‌ను అవుట్‌ చేశాడు. అయితే అప్పటికే ఈ సీజన్‌లో షార్జా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది.


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (బి) హెన్రిక్స్‌ 25, పడిక్కళ్‌ (సి) రాహుల్‌ (బి) హెన్రిక్స్‌ 40, క్రిస్టియన్‌ (సి) ఖాన్‌ (బి) హెన్రిక్స్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) ఖాన్‌ (బి) షమి 57, డివిల్లీర్స్‌ (రనౌట్‌/ఖాన్‌) 23, షాబాజ్‌ (బి) షమి 8, భరత్‌ (నాటౌట్‌) 0, గార్టన్‌ (బి) షమి 0, హర్షల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 164/7; వికెట్లపతనం: 1/68, 2/68, 3/73, 4/146, 5/157, 6/163, 7/163, బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 1-0-5-0, షమి 4-0-39-3, అర్ష్‌దీప్‌ 3-0-42-0, బిష్ణోయ్‌ 4-0-35-0, హర్‌ప్రీత్‌ 4-0-26-0, హెన్రిక్స్‌ 4-0-12-3


పంజాబ్‌: రాహుల్‌ (సి) పటేల్‌ (బి) షాబాజ్‌ 39, మయాంక్‌ (సి) సిరాజ్‌ (బి) చాహల్‌ 57, పూరన్‌ (సి) పడిక్కళ్‌ (బి) చాహల్‌ 3, మార్‌క్రమ్‌ (సి) క్రిస్టియన్‌ (బి) గార్టన్‌ 20, సర్ఫ్‌రాజ్‌ (బి) చాహల్‌ 0, షారుక్‌ (రనౌట్‌/పటేల్‌) 6, హెన్రిక్స్‌ (నాటౌట్‌) 12, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 158/6; వికెట్లపతనం: 1/91, 2/99, 3/114, 4/121, 5/127, 6/146, బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-33-0, గార్టన్‌ 4-0-27-1, షాబాజ్‌ 3-0-29-1, హర్షల్‌ 4-0-27-0, చాహల్‌ 4-0-29-3, క్రిస్టియన్‌ 1-0-11-0.


ఆ ఒక్కటి ఎవరిది?

ఐపీఎల్‌ లీగ్‌ దశ దాదాపు ముగింపునకు వచ్చింది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్‌ స్థానాలు ఖరారయ్యాయి. ఇకపోతే మిగిలింది ఒక్కటే బెర్త్‌. దానికోసం కోల్‌కతా, రాజస్థాన్‌, ముంబై తలపడుతున్నాయి. ఆదివారం ఓటమితో పంజాబ్‌ దాదాపు టోర్నీనుంచి నిష్క్రమించింది. 13 మ్యాచ్‌ల ద్వారా ఆ జట్టు 10 పాయింట్లతో ఉంది. మిగిలిన ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టుకు 12 పాయింట్లే ఉంటాయి. పంజాబ్‌ నెట్‌ రన్‌రేట్‌ కూడా (-0.241) దారుణంగా ఉంది. ఇంకా..రాజస్థాన్‌ (10 పాయింట్లు), ముంబై (10) కంటే కూడా ఓ మ్యాచ్‌ అదనంగా పంజాబ్‌ ఆడింది. హైదరాబాద్‌పై గెలుపుతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్‌కతా సజీవంగా ఉంచుకుంది. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కలిగిన నైట్‌రైడర్స్‌ చివరి మ్యాచ్‌ రాజస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అందులో నెగ్గితే కోల్‌కతాకు నాలుగో బెర్త్‌ లభిస్తుంది. ఇక ప్లేఆ్‌ఫ్సకు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ తప్పక గెలవాలి. మంగళవారం ముంబైతో పోరు రాజస్థాన్‌కు అత్యంత కీలకం. ఇందులో రాజస్థాన్‌ గెలిస్తే ముంబై ఇంటికే. ఇక గురువారం రాజస్థాన్‌-కోల్‌కతా నడుమ మ్యాచ్‌ను నాకౌట్‌గా చెప్పాలి. నాలుగో బెర్త్‌ రేస్‌లోని జట్లన్నింటికంటే రన్‌రేట్‌లో ఆఖరున ఉన్న ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లేఆప్స్‌ స్థానం గగనమే. 

Updated Date - 2021-10-04T07:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising