ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైకి షాకిచ్చిన రాజస్తాన్

ABN, First Publish Date - 2021-10-03T05:17:01+05:30

ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ ఊహించని షాకిచ్చింది. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ ఊహించని షాకిచ్చింది. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి అభిమానులకు అసలైన క్రికెట్ మజా పంచింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు అదిరిపోయే ఓపెనింగ్ దక్కింది. ఓపెనర్ యశశ్వి జైస్వాల్(50: 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మైదానంలోకి అడుగుపెట్టడంతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడడంతో రాజస్తాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. జైశ్వాల్‌కు తోడుగా.. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్(27: 12 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కులు చూపించాడు. పవర్ ప్లే ముందు వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటైన తర్వాత.. కెప్టెన్ సంజు శాంసన్(28: 24 బంతుల్లో 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడాడు.


అయితే మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే(64 నాటౌట్: 42 బంతుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో మరో 15 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌‌లో చెన్నై బౌలర్లు తేలిపోయారు. శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, కేఎం ఆసిఫ్ 1 వికెట్ తప్ప మరే బౌలర్ కూడా వికెట్ దక్కించుకోలేకపోయారు. అయితే జట్టు ఓడినా అజేయ సెంచరీతో మెరిసిన చెన్నై బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్(101)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 





Updated Date - 2021-10-03T05:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising