ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ భాయ్‌ను ఇలా చూడలే..

ABN, First Publish Date - 2021-04-10T09:12:42+05:30

రాహుల్‌ ద్రావిడ్‌ శాంత స్వభావి. మృదుభాషి. క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో అతడు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన సందర్భాలు అరుదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహ్లీ కామెంట్‌


న్యూఢిల్లీ: రాహుల్‌ ద్రావిడ్‌ శాంత స్వభావి. మృదుభాషి. క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో అతడు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన సందర్భాలు అరుదు. కానీ రిటైరైన సుదీర్ఘ కాలం తర్వాత అతడు ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించడం ఆసక్తికరమైతే.. అందులో అత్యంత ఆగ్రహంగా కనిపించడంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఆశ్చర్యపోయాడు. ‘రాహుల్‌ భాయ్‌లో ఈ కోణాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని సరదాగా ట్వీట్‌ చేశాడు. ఓ క్రెడిట్‌ కార్డు కంపెనీ యాడ్‌ అది. అందులో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ద్రావిడ్‌ అసహనంతో పక్కన కార్లలో ఉన్న వారిపై చిందులేస్తాడు. అంతేకాదు బ్యాటుతో పక్కనున్న మరో వాహనం మిర్రర్‌ను పగలగొడతాడు. అంతటిటో ఆగకుండా ‘ఇంద్రానగర్‌ గూండాను’ అని హూంకరిస్తాడు. సోషల్‌మీడియాలో శుక్రవారంనాడు వైరల్‌ అయిన ఈ యాడ్‌కు విపరీతంగా లైక్‌లొచ్చాయి. పలువురు సరదా కామెంట్లు పెట్టగా, వారిలో విరాట్‌ కూడా చేరిపోయాడు. 

Updated Date - 2021-04-10T09:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising