ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ శతకం

ABN, First Publish Date - 2021-07-21T08:38:31+05:30

కౌంటీ సెలెక్ట్‌ లెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌ టాపార్డర్‌ విఫలమైనా, మిడిలార్డర్‌ ఆదుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌంటీతో మ్యాచ్‌ - భారత్‌ 306/9

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: కౌంటీ సెలెక్ట్‌ లెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌ టాపార్డర్‌ విఫలమైనా, మిడిలార్డర్‌ ఆదుకొంది. కేఎల్‌ రాహుల్‌ (101) సెంచరీతో రాణించడంతో.. మంగళవారం ఆట చివరకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 306 పరుగులు సాధించింది. రవీంద్ర జడేజా (75) అర్ధ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (9), మయాంక్‌ అగర్వాల్‌ (28), చటేశ్వర్‌ పుజారా (21), విహారి (24) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడంతో రోహిత్‌ పగ్గాలు చేపట్టాడు.


సంక్షిప్త స్కోర్లు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 90 ఓవర్లలో 306/9 (కేఎల్‌ రాహుల్‌ 101, జడేజా 75, మయాంక్‌ 28, వి హారి 24, పుజార 21, రోహిత్‌ 9; మైల్స్‌ 3/42, జేమ్స్‌ 2/32) 

ప్రత్యర్థి జట్టులో ఆవేశ్‌, సుందర్‌:

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పరస్పర అంగీకారంతో కౌంటీ సెలెక్ట్‌ లెవెన్‌ తరఫున టీమిండియా రిజర్వ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బరిలోకి దిగారు. ఆవేశ్‌ 9.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. సుందర్‌ మాత్రం ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. అయితే బ్యాట్స్‌మన్‌ విహారి బంతిని ఆపబోయిన ఆవేశ్‌ బొటన వేలికి గాయమైంది. కాగా, 1987లో భారత టూర్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తరఫున 14 ఏళ్ల సచిన్‌ టెండూల్కర్‌ ఫీల్డింగ్‌ చేశాడు. ముంబైలోని బ్రబ్రోన్‌ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓ పాక్‌ ఆటగాడు గాయపడడంతో బాల్‌బాయ్‌ సచిన్‌ చేత ఫీల్డింగ్‌ చేయించారు. 

Updated Date - 2021-07-21T08:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising