ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుదిపోరుకు సింధు

ABN, First Publish Date - 2021-03-07T09:35:22+05:30

ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు.. స్విస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, నాలుగో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ జోడీ పోరాటం సెమీ్‌సలోనే ముగిసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్విస్‌ ఓపెన్‌
  • నేడు మారిన్‌తో అమీతుమీ
  • సెమీ్‌సలో శ్రీకాంత్‌, సాత్విక్‌ జోడీ ఓటమి

బాసిల్‌: ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు.. స్విస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, నాలుగో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ జోడీ పోరాటం సెమీ్‌సలోనే ముగిసింది.  శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సెమీస్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ సింధు 22-20, 21-10తో నాలుగో సీడ్‌ మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆదివారం జరిగే తుది పోరులో టాప్‌ సీడ్‌ కరోలినా మారిన్‌తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. 43 నిమిషాల పోరులో తొలి గేమ్‌ హోరాహోరీగా సాగినా.. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2019 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స తర్వాత సింధు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. కాగా, పురుషుల సింగిల్స్‌ సెమీ్‌సలో శ్రీకాంత్‌ 13-21, 19-21తో టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. డబుల్స్‌ సెమీ్‌సలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ద్వయం 10-21, 17-21తో డెన్మార్క్‌ జంట కిమ్‌ అస్ట్ర్‌ఫ-ఆండ్రెస్‌ సక్కరప్‌ రాస్‌ముసెన్‌ చేతిలో ఓడింది. కాగా, క్వార్టర్స్‌లో కిడాంబి 21-19, 21-15తో కంటపోన్‌ వాంగ్‌చరోన్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తు చేయగా.. సాత్విక్‌-చిరాగ్‌ జంట 12-21, 21-19, 21-12తో మలేసియాకు చెందిన ఆంగ్‌ యె సిన్‌-టొ ఎ యిపై నెగ్గింది. 


Updated Date - 2021-03-07T09:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising