ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Muttiah Muralitharan: పృథ్వీషాలో సెహ్వాగ్ కనిపిస్తున్నాడు!

ABN, First Publish Date - 2021-07-18T02:05:44+05:30

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాను చూస్తుంటే తనకు వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొస్తున్నాడని శ్రీలంక మాజీ స్పిన్నర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాను చూస్తుంటే తనకు వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొస్తున్నాడని  శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. షాలో భయమన్నదే కనబడదని, వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపిస్తుంటాడని పేర్కొన్నాడు.  


‘‘షా ఆడతున్న తీరును చూస్తుంటే అతడు టెస్టుల కంటే వన్డే, టీ20లకే అతికినట్టు సరిపోతాడు. అతడు సెహ్వాగ్‌ను తలపిస్తుంటాడు. ఎంతో రిస్క్ తీసుకుని ఆడుతూ బౌలర్లలో ఒత్తిడి పెంచుతాడు.


అతడు కనుక స్కోరు చేస్తే ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. కొద్దికాలంలోనే షా ఎన్నో పరుగులు చేశాడు. అతడి చాలా నైపుణ్యం ఉండడంతోపాటు భయం లేదు. అవుటవుతానన్న భయం అతడితో ఏమాత్రం కనిపించదు’’ అని మురళీధరన్ వివరించాడు.


కాబట్టి పృథ్వీ షా లాంటి వారిని భారత్ ప్రోత్సహించాలని సూచించాడు. అతడు తన సహజ సిద్ధమైన గేమ్‌ను ఆడేందుకు మేనేజ్‌మెంట్ స్వేచ్ఛ ఇవ్వాలన్నాడు.  


మ్యాచ్‌లను గెలిపించే ఆటగాళ్లు కావాలి కాబట్టి షాను స్వేచ్ఛగా ఆడేలా వదిలేయాలి. అతడు చాలా ప్రమాదకర బ్యాట్స్‌మన్. షా గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే అతడు సన్‌రైజర్స్‌కు ఆడాడు. పృథ్వీ కనుక క్రీజులో కుదురుకుంటే బౌలింగ్‌ను తుత్తినియలు చేస్తాడు. ఇండియాకు అది గొప్ప అవకాశం అవుతుంది’’ అని మురళీధరన్ వివరించాడు.

Updated Date - 2021-07-18T02:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising