ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమోద్ భగత్‌ను అభినందించిన మోదీ, అభినవ్ బింద్రా

ABN, First Publish Date - 2021-09-05T00:41:30+05:30

పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించినన షట్లర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన షట్లర్ ప్రమోద్ భగత్‌ను ప్రధాని నరేంద్రమోదీ, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా అభినందించారు. ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్ఎల్‌3 క్లాస్‌లో  గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెథల్‌ను ఓడించిన భగత్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడైన భగత్ ఈ అంశంలో పసిడి పతకం గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 


ప్రమోద్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భగత్ దేశ ప్రజలను హృదయాలను గెలుచుకున్నారని ట్వీట్ చేశారు. అతడో చాంపియన్ అని, ఈ విజయం కోట్లాదిమందికి స్పూర్తిగా నిలుస్తుందని ట్వీట్ చేయగా, ఒలింపిక్స్‌లో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా.. ప్రమోద్‌ను ప్రశంసించాడు. అద్భుతమైన అతడి ఆటతీరుకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు.  

Updated Date - 2021-09-05T00:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising