ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడైనా ముంబైకి తిరుగులేదు: పార్థివ్

ABN, First Publish Date - 2021-03-12T22:49:06+05:30

ముంబై ఎక్కడ ఆడుతుందనేది పెద్ద విషయం కాదని ఆ జట్టు టాలెంట్ స్కౌట్ పార్థివ్ పటేల్ అన్నాడు. తాము ఎంతో కష్టపడ్డామని, దానివల్ల ఏ మైదానంలో ఆడుతున్నామనే విషయం ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ ఎక్కడ ఆడుతుందనేది పెద్ద విషయం కాదని ఆ జట్టు టాలెంట్ స్కౌట్ పార్థివ్ పటేల్ అన్నాడు. తాము ఎంతో కష్టపడ్డామని, దానివల్ల ఏ మైదానంలో ఆడుతున్నామనే విషయం ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పార్థివ్.. ఐపీఎల్‌లో వేరే మైదానాల్లో ఆడాల్సి రావడంపై స్పందించాడు. జట్టు ప్రస్తుతం పూర్తి సమతూకంతో ఉందని, అందువల్ల ఎక్కడైనా ఆడే సత్తా తమకుందని అన్నాడు. అలాగే తమ జట్టులో ఎప్పటినుంచో ఓ అనుభవజ్ఞుడైన రిస్ట్ స్పిన్నర్ కావాలని అనుకుంటున్నామని, పీయూష్ చావ్లా రాకతో ఆ లోటు కూడా తీరిందని అన్నాడు. పార్థివ్ రాకతో జట్టు మరింత బలపడిందని, ఇప్పుడు అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ పటిష్ఠంగా ఉందని చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రాంరభం కాబోతోంది. దీనికోసం మొత్తం 6 వేదికలను బీసీసీఐ నిర్ణయించింది. అయితే మునుపటిలా హోం గ్రౌండ్స్‌ మ్యాచ్‌లను మాత్రం తొలగించింది. ప్రతి జట్టు ఆడే ప్రతి మ్యాచ్ ఆ రెండు జట్లకు సంబంధం లేని వేదికలలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగానే ముంబై వేరే మైదానాల్లో ఆడాల్సి వస్తోంది. ముంబై మ్యాచ్‌లు అత్యధికంగా చెన్నై గ్రౌండ్‌లో జరగనుండగా.. మరికొన్ని మ్యాచ్‌లు డిల్లీలో,  బెంగళూరు, చెన్నైలలో ఆడనుంది.

Updated Date - 2021-03-12T22:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising