ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Messi-Ramos: ఏళ్లుగా ప్రత్యర్థులు.. ఇప్పుడు ఇలా..

ABN, First Publish Date - 2021-08-13T09:10:16+05:30

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో వాళ్లిద్దరూ ఏళ్లుగా ప్రత్యర్థులు. ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఎన్నోసార్లు మైదానంలో నువ్వా-నేనా అంటూ తలపడ్డారు. అయితే తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో వాళ్లిద్దరూ ఏళ్లుగా ప్రత్యర్థులు. ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఎన్నోసార్లు మైదానంలో నువ్వా-నేనా అంటూ తలపడ్డారు. అయితే తాజాగా నవ్వుతూ ఒకే జెర్సీలో వీరిద్దరూ కెమెరాకు చిక్కడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ఇంతకీ ఆ ఆటగాళ్లెవరో తెలుసా..? ఫుట్ బాల్ స్టార్స్.. లియోనల్ మెస్సీ, సర్జియో రామోస్. రెండు దశాబ్దాలుగా తాను ఆడుతున్న బార్సిలోనా క్లబ్‌కు ఇటీవల మెస్సీ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక మరోపక్క రామోస్ రియల్ మాడ్రిడ్‌ క్లబ్‌కు వీడ్కోలు చెప్పాడు. 


వీరిద్దరూ తాజాగా పీఎస్‌జీ క్లబ్‌లో చేరారు. దీంతో వీరిద్దరూ స్నేహపూర్వకంగా కలుసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, నవ్వుతూ మాట్లడుకోవడం అభిమానులను కన్నులపండువగా ఉంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనికోసమే తాము ఎదురు చూస్తున్నామని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. వాళ్లిద్దరూ ప్రత్యర్థులే కానీ, శత్రువులు కాదని మరో యూజర్ కామెంట్ చేశాడు.



Updated Date - 2021-08-13T09:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising