ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడం మంచిది: కమిన్స్

ABN, First Publish Date - 2021-05-07T21:31:16+05:30

కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. భారతీయులకు ఏది మంచిదో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఈ విషయమై క్రికెట్ వర్గాలు ప్రభుత్వాలతో చర్చించాలన్నాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ-20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 


ఈ ఏడాది చివర్లో భారత్‌లో మూడో దశ విజృంభిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమిన్స్ స్పందించాడు. `టీ-20 ప్రపంచకప్‌నకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. దానిపై ఇప్పుడే మాట్లాడడం సరికాదు. అయితే ఈ ప్రపంచకప్ నిర్వహణ భారత్ వనరులను దెబ్బతీస్తుందని తెలిసినా, సురక్షితం కాదని తెలిసినా దానిని యూఏఈకి తరలించాలి. భారతీయులకు ఏది అవసరమో క్రికెట్ వర్గాలు ప్రభుత్వాలతో చర్చించాలి. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. టీ-20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు వెళితే మంచిద`ని కమిన్స్ సూచించాడు. 

Updated Date - 2021-05-07T21:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising