ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర తిరగరాసిన పాకిస్తాన్.. వికెట్ పడకుండా ఇండియాపై విన్

ABN, First Publish Date - 2021-10-25T04:30:34+05:30

పాకిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల పాకిస్తాన్ చరిత్రలో సాధ్యం కాని ఓ అరుదైన, అత్యంత విలువైన రికార్డును పాకిస్తాన్ సొంతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: పాకిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల పాకిస్తాన్ చరిత్రలో సాధ్యం కాని ఓ అరుదైన, అత్యంత విలువైన రికార్డును పాకిస్తాన్ సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాపై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో ఇండియాపై పాకిస్తాన్ గెలవలేదనే అప్రతిష్ఠను తొలగించుకుంది.


అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభం నుంచే అదరగొట్టింది. ఓపెనర్లు బాబార్ అజాం(68), మహ్మద్ రిజ్వాన్(78) అజేయ అర్థ సెంచరీలతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. టీ20 చరిత్రలో వికెట్ పడకుండా టార్గెట్ ఛేజ్ చేయడం పాకిస్తాన్‌కు ఇదే ఫస్ట్ టైం. దీంతో మొట్టమొదటి సారి ఐసీసీ టోర్నీలో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లలో ఒక్క బౌలర్ కూడా వికెట్ తీయలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 3 వికెట్లతో అదరగొట్టిన షాహిద్ అఫ్రిదికీ దక్కింది.


తొలుత పాక్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. సూపర్ బౌలింగ్‌తో టీమిండియా టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చారు. పేసర్లు షాహిన్ అఫ్రిది 3 వికెట్లు, హసన్ అలీ 2 వికెట్లు, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్ 1 వికెట్ తీసుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(57) అర్థసెంచరీతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల స్కోరు చేసింది. 

Updated Date - 2021-10-25T04:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising