ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజు బౌలర్ల హవా

ABN, First Publish Date - 2021-01-27T06:48:40+05:30

రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం మొదలైన ఆరంభ టెస్ట్‌లో తొలిరోజు బౌలర్ల హవా సాగింది. ఇరుజట్ల బౌలర్ల వీరవిహారంతో మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సౌతాఫ్రికా 220 ఆలౌట్‌


కరాచీ: రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం మొదలైన ఆరంభ టెస్ట్‌లో తొలిరోజు బౌలర్ల హవా సాగింది. ఇరుజట్ల బౌలర్ల వీరవిహారంతో మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. యాసిర్‌ షా (3/54), నౌమన్‌ అలీ (2/38), షహీన్‌ షా అఫ్రీది (2/49) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (58) టాప్‌ స్కోరర్‌. జార్జ్‌ లిండే 35, డుప్లెసి 23 రన్స్‌ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఆట చివరకు 33/4తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఇమ్రాన్‌ బట్‌ (9), అబిద్‌ అలీ (4) విఫలమయ్యారు. రబాడ (2/8) రెండు వికెట్లు పడగొట్టగా.. నోకియా, కేశవ్‌ మహరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. అజర్‌ అలీ (5 బ్యాటింగ్‌), ఫవాద్‌ ఆలమ్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 


Updated Date - 2021-01-27T06:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising