ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాహిద్ అఫ్రిదీకి అల్లుడు కానున్న షాహిన్ అఫ్రిది

ABN, First Publish Date - 2021-03-07T22:49:41+05:30

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుమార్తెను పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు వీరిద్దరికీ నిశ్చితార్థం జరగబోతోంది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలూ అధికారికంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుమార్తెను పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు వీరిద్దరికీ నిశ్చితార్థం జరగబోతోంది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలూ అధికారికంగా ప్రకటించాయి. మరి కొద్ది రోజుల్లో షాహిన్ అఫ్రిదికి, షాహిద్ అఫ్రిది కూతురు అక్సాకు నిశ్చితార్థం జరగనున్నట్లు కుటుంబ పెద్దలు చెబుతున్నారు. అయితే గత రెండేళ్ల నుంచి ఈ వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


ఈ వివాహంపై షాహీన్ తండ్రి అయాజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ కుటుంబాల మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని, ఈ నేపథ్యంలోనే షాహిద్ అఫ్రిది కూతురును తమ కోడలిని చేసుకుంటామని కోరామని, దానికి షాహిద్ అఫ్రిదీ కుటుంబం కూడా అంగీకరించిందని తెలిపారు.


కాగా.. షాహిద్ అఫ్రిదికి మొత్తం ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, ఆర్వా. వీరిలో అఫ్రిది పెద్ద కూతురైన 20 ఏళ్ల అక్సాను షాహీన్ అఫ్రిదీకిచ్చి పెళ్లిచేసేందుకు షాహిద్ అఫ్రిదీ కుటుంబం అంగీకారం తెలిపింది. అయితే షాహీన్ అఫ్రిదీకి కూడా 20 ఏళ్లే కావడం గమనార్హం.

Updated Date - 2021-03-07T22:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising