ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్ కరోనాతో మృతి

ABN, First Publish Date - 2021-05-08T16:40:24+05:30

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్(65) కరోనాతో శనివారం ఉదయం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్(65) కరోనాతో శనివారం ఉదయం మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్ లో బంగారుపతకాన్ని సాధించిన రవీందర్ పాల్ సింగ్ గత రెండు వారాలుగా కరోనాతో లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రవీందర్ పాల్ సింగ్ కరోనాతో గత నెల 24వతేదీన లక్నోలోని వివేకానంద ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని, పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతన్ని నాన్ కొవిడ్ వార్డుకు బదిలీ చేశారు. అనంతరం రవీందర్ పాల్ పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో శుక్రవారం అతన్ని వెంటిలేటరుపై ఉంచారు.


1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో కూడా ఆడిన సింగ్ వివాహం చేసుకోలేదు. సింగ్ 1978 జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్నారు. హాకీ నుంచి నిష్ర్కమించాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.సీతాపూర్ లో జన్మించిన సింగ్ 1979 నుంచి 1984 వరకు క్రీడల్లో రాణించారు. రెండు ఒలింపిక్స్ తోపాటు కరాచీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో (1980.1983), హాంకాంగ్ లో జరిగిన సిల్వర్ జూబ్లీ 10 దేశాల కప్, ముంబై ప్రపంచ కప్ , 1982 కరాచీలో జరిగిన ఆసియా కప్ పోటీల్లో సింగ్ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T16:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising