ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొఫెషనల్ బాక్సింగులోకి ఒలింపిక్ పతక విజేత లవ్లీనా

ABN, First Publish Date - 2021-11-27T01:00:45+05:30

ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ తన మనసులో మాటను వెల్లడించింది. ప్రొఫెషనల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ తన మనసులో మాటను వెల్లడించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి వెళ్లబోతున్నట్టు చెప్పింది.  నిజానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ తన కల అని పేర్కొన్న లవ్లీనా.. భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగును ఎంచుకున్న వారు పెద్దగా లేరని పేర్కొంది.


కాబట్టి ఈ రంగంలో తన ముద్ర వేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ‘స్పోర్ట్స్ స్టార్’ నార్త్ ఈస్ట్ స్పోర్ట్స్ కాంక్లేవ్‌కు హాజరైన లవ్లీనా ఈ వ్యాఖ్యలు చేసింది. 


ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా రికార్డు సృష్టించింది. అంతకుముందు విజేందర్ సింగ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు.


అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా తొలుత కిక్‌బాక్సర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో తాను పతకం సాధించిన తర్వాత తన స్వగ్రామంలోని పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్టు తెలిపింది.  

Updated Date - 2021-11-27T01:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising