ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: సింగిల్స్‌లో పతకం లేకుండానే ముగిసిన జొకోవిక్ పోరు

ABN, First Publish Date - 2021-08-01T00:16:56+05:30

గోల్డ్‌న్ స్లామ్‌ను పూర్తిచేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించే అవకాశాన్ని జారవిడుచుకున్న టెన్సిస్ స్టార్ నొవాక్ జొకోవిక్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: గోల్డ్‌న్ స్లామ్‌ను పూర్తిచేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించే అవకాశాన్ని జారవిడుచుకున్న టెన్సిస్ స్టార్ నొవాక్ జొకోవిక్.. సింగిల్స్‌ పోరును పతకం లేకుండానే ముగించాడు. కాంస్యం కోసం స్పానిష్ టెన్నిస్ స్టార్ పాబ్లో కరెనో బుస్టాతో జరిగిన హోరాహోరీ పోరులో 4-6, 7-6, 3-6తో పరాజయం పాలయ్యాడు.


జొకోవిక్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. 20 సార్లు గ్రాండ్‌ స్లామ్ చాంపియన్ అయిన జొకోవిక్‌కు ఒలింపిక్స్‌లో అదే తొలి పతకం. నిజానికి ఈ ఏడాదిని అతడు అద్భుతంగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లలో వరుస విజయాలు సాధించాడు. అయితే, గోల్డెన్ స్లామ్ సాధించాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు.


ఒలింపిక్స్‌లో పతకం అందుకుని, యూఎస్ ఓపెన్‌లో గెలిస్తే గోల్డెన్ స్లామ్ సాధించాలన్న అతడి స్వప్నం నెరవేరేది. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ సెమీ‌స్‌లోనూ జొకోవిక్-నీనా స్టోజోనోవిక్ జంట ఓటమి పాలైంది. కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియాకు చెందిన పీర్స్ జాన్-బార్టీ జంటతో జొకోవిక్-నీనా జంట తలపడనుంది. 

Updated Date - 2021-08-01T00:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising