ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిక్స్ కొడితే.. కొత్త బంతి.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్?

ABN, First Publish Date - 2021-08-11T05:28:26+05:30

ఐపీఎల్‌లో సరికొత్త విధానం అమలు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. బ్యాట్స్‌మన్ సిక్స్ కొడితో మళ్లీ ఆ బంతి ఆటగాళ్లకు ఇవ్వకూడదంటూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో సరికొత్త విధానం అమలు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. బ్యాట్స్‌మన్ సిక్స్ కొడితో మళ్లీ ఆ బంతి ఆటగాళ్లకు ఇవ్వకూడదంటూ కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. అక్టోబర్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో ఈ ఏడాది మార్చిలో టోర్నీ ప్రారంభమైనా.. కొందరు ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో టోర్నీ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ మరింత పటిష్ఠంగా ఐపీఎల్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి తోడు సెకండ్ షెడ్యూల్ యూఏఈలో జరగనుండడం, అక్కడ 50శాతం ప్రేక్షకులను అనుమతించనుండడంతో బంతి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.


అందులో భాగంగానే ఆటగాళ్లు ఎవరైనా సిక్సర్‌ బాదితే ప్రత్యామ్నాయ బంతిని ఇవ్వనుందని తాజా సమాచారం. అయితే ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌ సిక్సర్ బాదితే స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని అంపైర్లు వెంటనే శానిటైజ్‌ చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఏకంగా మరో బంతిని ఇవ్వనుందని సమాచారం. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు బంతిని తాకుతారని, అదే బంతిని ఆటగాళ్లు కూడా తాకవలసి వస్తుందని, దీనివల్ల కూడా కొవిడ్‌ వచ్చే అవకాశాలు ఉంటాయనే అనుమానంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-11T05:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising