ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినేశ్ ఫోగట్‌కు మద్దతుగా నీరజ్ చోప్రా

ABN, First Publish Date - 2021-08-17T09:46:20+05:30

టీమిండియా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు తన మద్దతు ఉంటుందని టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా అన్నారు. దేశం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు తన మద్దతు ఉంటుందని టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా అన్నారు. దేశం కోసం వినేశ్ ఎంతో చేశారని, ఆమెకు తము ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘భారత మేటి అథ్లెట్లలో వినేశ్ ఫోగట్ ఒకరు. ప్రపంచ వేదికలపై ఆమె దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. మేమంతా నీ విషయంలో గర్వపడుతున్నాం. నీ తదుపరి జీవితంలో మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం’ అంటూ నీరజ్ చోప్రా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.


కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో క్షమశిక్షణ మీరినందుకు గానూ వినేశ్ ఫోగట్‌పై అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎలాంటి పోటీల్లోనూ ఆమె పాల్గొనకుండా వేటు వేసింది. అయితే తన చర్యలను క్షమించాలని వినేష్ డబ్ల్యూఎఫ్‌ఐకు క్షమాపణలు తెలిపింది. అయినప్పటికీ త్వరలో జరగబోయే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌నకు డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెను అనుమతించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-17T09:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising