ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెప్టెన్‌గా నా మొదటి ప్రత్యర్థి అతడే.. టెన్షన్‌గా ఉంది: పంత్

ABN, First Publish Date - 2021-04-07T00:36:38+05:30

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ఈసారి ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) జట్టుకు సారథ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ఈసారి ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) జట్టుకు సారథ్యం వహించే అవకాశం లభించింది. శ్రేయాస్ అయ్యర్ ఆ జట్టు పగ్గాలను మోస్తుండగా, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అయ్యర్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో యాజమాన్యం పంత్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నెల 10న ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)తో డీసీ తలపడనుంది. ఈ నేపథ్యంలో పంత్ కాస్తంత టెన్షన్‌గా కనిపిస్తున్నాడు. 


ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్ మహీభాయ్‌తోనేనని, తనకు చాలా టెన్షన్‌గా ఉందని పేర్కొన్నాడు. ధోనీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఇది తనకు మంచి అనుభవం అవుతుందన్నాడు. 


ప్లేయర్‌గా తనకు ఉన్న అనుభవంతోపాటు ధోనీ నుంచి కూడా కొంత నేర్చుకున్నానని, సీఎస్‌కేతో మ్యాచ్‌లో దానిని ఉపయోగిస్తానని పంత్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు అందరూ మానసికంగా పటిష్టంగా ఉన్నారని, ఈసారి తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంటామని పంత్ ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కోచ్‌లు, జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పటి వరకు జట్టు టైటిల్ సాధించలేదని, ఈసారి మాత్రం సొంతం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని పంత్ పేర్కొన్నాడు. 

Updated Date - 2021-04-07T00:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising