ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు నిమిషాల్లో నా English ఖతం

ABN, First Publish Date - 2021-10-27T22:52:55+05:30

టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది అఫ్ఘానిస్తాన్. అయితే మ్యాచ్ అయిపోగానే సంప్రదాయం ప్రకారం కెప్టెన్ మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. స్టేడియంలో ఉన్న వారితో సహా టీవీ చూస్తున్నవారు కూడా అఫ్ఘాన్ క్రికెట్ టీం కెప్టెన్ మహ్మద్ నబీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో అతడు రానే వచ్చి మాట్లాడుతున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది అఫ్ఘానిస్తాన్. అయితే మ్యాచ్ అయిపోగానే సంప్రదాయం ప్రకారం కెప్టెన్ మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. స్టేడియంలో ఉన్న వారితో సహా టీవీ చూస్తున్నవారు కూడా అఫ్ఘాన్ క్రికెట్ టీం కెప్టెన్ మహ్మద్ నబీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో అతడు రానే వచ్చి మాట్లాడుతున్నాడు. సడెన్‌గా ‘‘నా ఇంగ్లీష్ ఎంత సేపు, ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది’’ అన్నారు. అంతే అతడి గురించి తెలిసిన వాళ్లు పగళబడి నవ్వుతుంటే, తెలియనివాళ్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. మీడియా నబీనీ అనేక ప్రశ్నలు అడుగుతోంది. ఇంతలో నబీ స్పందిస్తూ ‘‘ఇది నాకు చాలా కష్టమైన పని. ఇన్ని ప్రశ్నలా? నా ఇంగ్లీష్ ఐదంటే ఐదు నిమిషాల్లో ముగుస్తుంది’’ అని అన్నాడు. చాలా మంది దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనప్పటికీ కొందరు అయితే ఇది సెల్ఫ్ రీమార్క్ అని అంటున్నారు.

Updated Date - 2021-10-27T22:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising