ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ 14: తొలి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే!

ABN, First Publish Date - 2021-04-10T16:48:45+05:30

నిన్నటి(శుక్రవారం) ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నిన్నటి(శుక్రవారం) ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు విజయం సాధించింది. ఎప్పటిలాగే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన సూపర్ విక్టరీతో బోణీ కొట్టింది. కాగా, ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.  

1. 2013 నుంచి ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతి ఓపెనింగ్ మ్యాచ్ ఓడిపోయింది. ఇలా ఇది వరుసగా తొమ్మిదో ఓటమి. 2012లో చెన్నైపై గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ముంబై తన తొలి మ్యాచ్‌లో గెలిచింది లేదు.  

2. ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబైపై 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2009లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్‌కు ఆడినప్పుడు ముంబైపై నాలుగు వికెట్లు తీశాడు.


3. ఆర్‌సీబీ తరఫున ఐదు వికెట్ల మార్క్ అందుకున్న మూడో బౌలర్ హర్షల్ పటేల్.

4. బెంగళూరు లాస్ట్ బాల్ వరకు ఆడి లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2012లో పుణే వారియర్స్‌పై మాత్రమే ఇలా జరిగింది. 

5. రన్‌మెషిన్ కోహ్లీ కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయి అందుకున్న తొలి సారథి కూడా కోహ్లీనే. 

6. ఐపీఎల్‌లో చివరి బంతిపై ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది ఐదవసారి. 

7. యుజ్వేంద్ర చాహల్‌కు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్. 

8. ఈ మ్యాచ్‌లో విరాట్ చేసిన 33 పరుగులతో ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ కొట్టిన ఆటగాడిగా కోహ్లీ(2753) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాబిన్ ఉత్తప్ప(2724) పేరిట ఉండేది. 


Updated Date - 2021-04-10T16:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising