ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతితక్కువ సమయంలో ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఏదంటే..

ABN, First Publish Date - 2021-02-25T23:53:06+05:30

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చూస్తుంటే కనీసం మూడు రోజులు కూడా సాగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు అత్యంత తక్కువ సమయంలో ముగిసిన టెస్టు మ్యాచ్ గురించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చూస్తుంటే కనీసం మూడు రోజులు కూడా సాగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు అత్యంత తక్కువ సమయంలో ముగిసిన టెస్టు మ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ చరిత్రలో చాలా వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ 1932లో ఆస్ట్రేలియా-సౌత్‌ఆఫ్రికాల మధ్య మెల్‌బోర్న్‌లో జరిగింది. అది సిరీస్‌లో ఐదో టెస్ట్ మ్యాచ్. సౌత్‌ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీ జట్టు దారుణంగా 23.2 ఓవర్లలోనే 36 పరుగులకే చాప చుట్టేసింది. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ జట్టు 54.3 ఓవర్లలో ఆలౌటై 153 పరుగులు సాధించింది. దీంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల వెనక నిలిచింది.


రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌత్‌ఆప్రికా మళ్లీ ఘోర ప్రదర్శన చేసింది. ఈ సారి 31.3 ఓవర్లలో 45 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ జట్టు ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మొత్తం కేవలం 109.2 ఓవర్లలోనే ముగిసింది. ఇప్పటివరకు అత్యంత తక్కువ సమయంలో ముగిసిన టెస్టుగా ఈ టెస్టు చరిత్రలో నిలిచిపోయింది. మరో విశేషమేంటంటే ఈ సిరీస్‌లో జరిగిన మొత్తం 5 మ్యాచ్‌లలోనూ సఫారీలు ఓడిపోయారు. దీంతో సిరీస్‌ను ఆసీస్ 5-0తేడాతో కైవసం చేసుకుంది.

Updated Date - 2021-02-25T23:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising